Fisheries Chairman Sai Kumar: కడెం డ్యాంలో చేప పిల్లల‌ విడుదల : రాష్ట్ర మత్స్య శాఖ చైర్మన్ సాయి కుమార్

సిరాన్యూస్‌,కడెం :
కడెం డ్యాంలో చేప పిల్లల‌ విడుదల : రాష్ట్ర మత్స్య శాఖ చైర్మన్ సాయి కుమార్
మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక కృషి : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
* హరీష్ రావ్, కేటీఆర్ ప్రజా ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం మానుకోవాలి

మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, రాష్ట్ర మత్స్య శాఖ చైర్మన్ సాయి కుమార్ పేర్కొన్నారు.శుక్రవారం మత్స్య శాఖ రాష్ట్ర మెట్టు సాయికుమార్ తో కలిసి నిర్మ‌ల్ జిల్లా కడెం డ్యాంలో చేప పిల్లలను విడుదల చేశారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రభుత్వంపై,మత్స్యశాఖపై బిఆర్ఎస్ అగ్ర నేతలు హరీష్ రావు, కేటీఆర్ లు తప్పుడు ప్రచారం మానుకోవాలన్నారు.గత 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఎం అభివృద్ధి చేశారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.చెరువులో చేపలు లేవంటూ ప్రచారం చేయడం సమంజసం కాదని,అనుమానాలు ఉంటే చెరువులో దూకి చేపలు ఉన్నాయో లేవో తెలుసుకోవాలన్నారు.రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు 100శాతం రాయితీతో చేప పిల్లలను అందిస్తుందని అన్నారు. మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందెందుకు ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని తెలిపారు.సబ్బండ వర్గాల అభివృద్దే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం నిరంతరం పని చేస్తోందన్నారు.ఖానాపూర్ నియోజకవర్గంలో చేపల పెంపక కేంద్రం ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు.అనంతరం మత్స్యశాఖ రాష్ట్ర చైర్మన్ మెట్టు సాయి కుమార్ తో పాటు అధికారులతో కలసి పడవలో ప్రయాణిస్తూ…కడెం ప్రాజెక్టును విక్షించారు.ప్రాజెక్ట్ విశిష్టతను మత్స్య శాఖ చైర్మన్ కు తెలియజేశారు.కార్యక్రమంలో జిల్లా అధికారులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *