సిరాన్యూస్, ఆదిలాబాద్
ఎస్పీ ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్
ఆదిలాబాద్ జిల్లాలో శ్రీరామనవమి సందర్భంగా శాంతి భద్రత కోసం కేంద్ర ప్రత్యేక పోలీసు బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు జిల్లా ఎస్పీ గౌష్ ఆలం తెలిపారు. ఫ్లాగ్ మార్చ్ బుధవారం ఉదయం ఆదిలాబాద్ పట్టణంలోని వినాయక్ చౌక్ నుంచి ప్రారంభమైన పురవీధుల గుండా కొనసాగింది.ఇందులో జిల్లా ఎస్పీ గౌష్ ఆలం, డీఎస్‌పీ జీవన్ రెడ్డి, సిఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.