పర్యాటకులపై నిషేధం
సిరా న్యూస్,ములుగు;
నాలుగు రోజుల నుండి కురుస్తున్న వర్షానికి లక్నవరం సరస్సులోకి భారీగా వరద నీరు చేరుతోంది. గోవిందరావుపేట మండలం గుస్సాపురం గ్రామంలోని లక్నవరం సరస్సుకు జలకళ సంతరించుకుంది. సరస్సు పూర్తి సామర్థ్యం 33 ఫీట్లు నిండి ఉదృతంగా మత్తడి పోస్తోంది. లక్నవరం సరస్సు మత్తడి పోయడంతో దయ్యాలవాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. లక్నవరం సరస్సు సందర్శనకు పర్యాటక శాఖ అనుమతి నిలిపివేసారు.