సిరా న్యూస్,ఒంగోలు.;
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బాపట్ల జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు ఉగ్రరూపం దాల్చాయి.
బాపట్ల జిల్లా ఇంకొల్లు సమీపంలోని దుద్దుకూరు వద్ద రెండు రోజులు గా కురుస్తున్న వర్షాలకు యార వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది .దీనితో ఇంకొల్లు – ఒంగోలు కు రాకపోకలు నిలిచి పోయాయి.పూసపాడు వద్ద ఉన్న కప్పల వాగు సైతం ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పర్చూరు – ఇంకొల్లు గ్రామాల మధ్య రాకపోకలకు కొంత మేర అంతరాయం ఏర్పడింది. వర్షాల కారణంగా పర్చూరు మండలంలో అధికారులు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. అల్పపీడన ప్రభావం వల్ల మరో రెండు రోజుల పాటు కొనసాగుతుందని..మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.