లక్ష రూపాయలు పలికిన పూలదండ..
సిరా న్యూస్,అమలాపురం;
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో మహిషాసుర మర్దిని అమ్మవారి మెడలో పూల దండ వేసేందుకు వేలంపాట జరిగింది. అమ్మవారి మెడలో పూలదండ వేసేందుకు వేలంపాటలో లక్ష మూడువేల రూపాయలకు పూల దండను హైదారాబాద్ భక్తుడు దక్కించుకున్నాడు. అమ్మవారి మెడలో పూల దండ వేసేందుకు భక్తలు అధిక సంఖ్యలో పోటిపడ్డారు. వేలంపాటలో దండ హైదారాబాద్ లో వుంటున్న భక్తుడు ఆకుల లక్ష్మణరావు పాడుకున్నారు. గత కొన్ని సవత్సరాలుగా శ్రీ మహిషాసుర మర్దిని అమ్మవారి మెడలో పూలదండకు వేలంపాట నిర్వహిస్తున్నారు. అమ్మవారి మెడలో పూల దండ వేస్తే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం. దసరా రోజు అమ్మవారి ఊరేగింపు రోజున అమ్మవారి మెడలో సదరు భక్తుడు పూలదండ వేయనున్నాడు. ప్రతి ఏటా లక్షల రూపాయలు అమ్మవారి మెడలో పూలదండ పలుకుతుంది. సాధారణంగా అమ్మవారి వచ్చిన చీరలు వేలం పాట పెట్టీ అమ్ముతారు కానీ ఇక్కడ మెడలో పూలదండ వేసేందుకు వేలంపాట పెట్టడం విశేషం..