సిరా న్యూస్,జగ్గయ్యపేట;
జాతీయ రహదారి 65 ని పొగ మంచు కమ్మెసింది. విజయవాడ & హైదరాబాద్ జాతీయ రహదారి పై తీవ్రంగా పొగమంచు ఆవరించింది. పొగ మంచు తీవ్రతకు వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. లైట్లు వేసుకుని వాహనాలను నడుపుతున్నారు. పొగ మంచు తీవ్రత తో చిల్లకల్లు టోల్ ప్లాజా కనిపించకుండా మునిగిపోయింది. రహదారి కనిపించకపోవడంతో రోడ్డు పక్కన వాహనాలను నిలుపుతున్నారు.