Food Festival: ఘ‌నంగా మేడిగూడ రోడ్ పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్

సిరా న్యూస్, బేల‌
ఘ‌నంగా మేడిగూడ రోడ్ పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్
* ఘుమఘుమలాడే పిండి వంటకాల ప్రదర్శ‌న‌
బడి అంటే చదవడం.. రాయడం.. మానసికోల్లాసానికి ఆటలు ఆడుకోవడం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారని చెబుతాం. కానీ
ఆదిలాబాద్ జిల్లా జైన‌థ్ కాన్పమేడిగూడ రోడ్ ఉన్నత పాఠశాలలో ఘనంగా ఫుడ్ నిర్వహించారు. విద్యార్థులు రకరకాల వంటకాలను చేసి ఘుమఘుమలాడే రుచికరమైన పిండి వంటకాలను ప్రదర్శించారు. కాన్పమేడిగూడ రోడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఇంటి దగ్గర స్వయంగా వివిధ రకాల పిండి వంటలు, తీపి పదార్ధాలు, చేపల బజ్జీలు, పకోడీలు తదితర వంటలను చేసుకొని వచ్చారు. ఉపాధ్యాయులు, గ్రామస్తులు, విద్యార్థులు రుచికరమైన పిండి వంటకాలన్నీ రుచి చూసి ఆనందం వ్యక్తం చేశారు. వంటకాలను ప్రదర్శించిన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో ఉన్నత, ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సత్యవాన్ చిక్టే , కొనిగెల నారాయణ, చైర్మన్ పోలవేణి అడేల్లు , గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ రాంరెడ్డి, ఉపాధ్యాయురాలు జ్యోతి, వసుధ ఉపాధ్యాయులు సంతోష్, నాందేవ్,అర్ష దేవదాస్, కృష్ణమూర్తి, భావాని ఆనంద్ ,సావయి ప్రకాష్, పెంటపర్తి ఊశన్న, భూమయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *