సిరా న్యూస్,హైదరాబాద్;
మాదాపూర్ హోటల్ కోహినూర్ వద్ద ఏర్పడ్డ ఫుట్పాట్ గుడిసెలను టి.ఎస్.ఐ.సి సిబ్బంది తొలగించారు. రోడ్లపై టాపిక్ కి ఇబ్బందికరమైన వాహనాలపై చలాన్లు రాయదుర్గం ట్రాఫిక్ పోలీసులు విధించారు. ఫుట్పాట్ వెండర్స్ పై చర్యలు తీసుకున్నారు ట్రాఫిక్ పోలీసులు. మాదాపూర్ ఐటిసి కోహినూర్ హోటల్ వద్ద వందల సంఖ్యలో ఫుట్పాట్ వ్యాపారాలు వెలిశాయి. ఫుట్పాట్ వ్యాపారులకు ప్రత్యామ్నాయంగా వేరే చోట స్థలాన్ని అధికారులు చూపించారు. చూపించిన స్థలానికి వెళ్లకుండా రోడ్లపై గుడిసెలు చిరు వ్యాపారులు వెసుకుంటున్నారు. ఫుట్పాట్ వ్యాపారుల సామాగ్రిని ట్రాఫిక్ పోలీసులు తీసుకెళ్లారు. మా సామాగ్రి మాకు ఇవ్వండి అని వ్యాపారులు ఆందోళన చేపట్టారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా తమ సామాగ్రిని తీసుకెళ్లారని ఆరోపిస్తున్నారు.