మారిన సినిమాల ట్రెండ్
సిరా న్యూస్,హైదరాబాద్;
దిక్కులేని వారికి దేవుడే దిక్కు అనే మాటను చాలా సార్లు వినే ఉంటాం. కానీఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఇదే మాట ఇంకాస్త కొత్తగా వినిపిస్తోంది.సిల్వర్ స్క్రీన్ మీద చిన్న హీరోలకు దేవుడే అండ అంటున్నారు. గాడ్ ఈజ్‌గ్రేట్ అనుకుంటూ చాలా మంది ఇప్పుడు ఈ ఫార్ములాకేఫిక్సయిపోతున్నారు.సంక్రాంతి రేసులో చిన్న సినిమాగా విడుదలై, వసూళ్లసునామీని సృష్టించింది హనుమాన్ సినిమా. ఆవకాయ ఆంజనేయ పాటను ఇప్పటికీమళ్లీ మళ్లీ పాడుకుంటున్నారు పిల్లలు.తేజ సజ్జా హీరోగా నటించినహనుమాన్‌కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్ ఎంత హెల్ప్ అయ్యాయో,ఆంజనేయుడి ప్రస్తావన కూడా అంతకన్నా ఎక్కువగా ప్లస్ అయింది. నిఖిల్‌కార్తికేయ2 సినిమాను ప్యాన్ ఇండియా రేంజ్‌లో ప్రొజెక్ట్ చేసినకాన్సెప్ట్ కృష్ణతత్వం. ద్వారక బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన కార్తికేయచూసిన నార్త్ ఆడియన్స్ కి గూస్‌బంప్స్ వచ్చాయి.
కృష్ణతత్వాన్ని పదే పదేగుర్తుచేసుకున్నారు ఆడియన్స్.సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న సినిమాఊరి పేరు భైరవకోన. ఈ సినిమాలో శివుడి పాటను విడుదల అయింది. ఆల్రెడీటాలీవుడ్‌లో చిన్న సినిమాలకు సాయం అందించి అండగా ఉంటున్న దేవుడుకాన్సెప్ట్ తమ చిత్రానికి కూడా కలిసొస్తుందన్నది మేకర్స్ మేట.విశ్వక్సేన్ హీరోగా నటిస్తున్న సినిమా గామి. టైటిల్ అనౌన్స్ మెంట్‌వీడియో గమనించిన వారందరికీ అఘోరాల సమావేశం, వారణాసి వాతావరణం, గంగా తీరంకనిపించాయి. వీటన్నటినీ బట్టి గామిలోనూ ఆధ్యాత్మిక అంశాలు పుష్కలంగాఉంటాయనే విషయం స్పష్టమవుతోంది.