సిరా న్యూస్,దుబాయ్;
ఏ భార్యకు ఏ భర్త అయినా ఏం బహుమతిగా ఇస్తాడు. చీరలో నగలో ఇస్తాడు. లేకుంటే నీకు ఇష్టమైంది ఏదైనా కొనుక్కొ అంటూ ఎంతో కొంత నగదు ఆమె చేతికి ఇస్తాడు. ఇదంతా దాదాపుగా అందరు భర్తలు చేసేదే. కానీ దుబాయ్‌లో బిలియనీర్ వ్యాపారవేత్త మాత్రం ఏకంగా ఓ ద్వీపాన్నే కొనేశాడు. అది కూడా ఆమె బికినీ వేసుకున్నప్పుడు ఎటువంటి ఇబ్బంది పడకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ భార్యా భర్తల ఖరీదైన ఈ ప్రేమ వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.దుబాయ్‌కు చెందిన మిలియనీర్, వ్యాపారవేత్త జమాల్ అల్ సదాక్ తన భార్య సౌదీ అల్ నదాక్ కోసం హిందూ మహాసముద్రంలో ఓ ద్వీపాన్ని కొనుగులు చేశారు. అది కూడా దాదాపు 50 మిలియన్ల డాలర్లతో కొనుగోలు చేశారు. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 418 కోట్లు. తన కోసం తన భర్త కొనుగోలు చేసిన ఈ ద్వీపం విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. అంతేకాదు.. ఆ ఐలాండ్ వీడియోను సైతం ఆమె షేర్ చేసింది.