వివిధ కేసుల్లో పట్టుకున్న రూ.5.5 కోట్ల విదేశీ సిగరెట్లను ధ్వంసం

: ఏపీ కస్టమ్స్ కమిషనర్ సాధు నరసింహారెడ్డి

సిరా న్యూస్,గుంటూరు;
అక్రమ రవాణా చేస్తూ, సుంకం చెల్లించకుండా వేర్వేరు కేసుల్లో పట్టుబడిన రూ.5.50 కోట్ల విలువ చేసే విదేశీ సిగరెట్లను ధ్వంసం చేసినట్లు ఏపీ కస్టమ్స్ కమిషనర్ సాధు నరసింహారెడ్డి తెలిపారు. స్వాధీనం చేసుకున్న సిగరెట్లను గుంటూరు, విశాఖపట్నంలలో గల జిందాల్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లలో కాల్చి బూడిద చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ నరసింహారెడ్డి మాట్లాడుతూ.. కాకినాడ, విజయవాడ, నెల్లూరు, తిరుపతిలలో తమ అధికారులు పట్టుకున్న 82,71,836 విదేశీ సిగరెట్ స్టిక్కులను స్వచ్ఛతా హీ సేవ 4.0 కార్యక్రమంలో భాగంగా ధ్వంసం చేసినట్లు తెలిపారు. గుంటూరు జిందాల్ ప్లాంట్ వారి సహకారంతో 73.71 లక్షల సిగరెట్ స్టిక్ లు, విశాఖ జిందాల్ ప్లాంట్ వారి సహకారంతో 9 లక్షల సిగరెట్లు స్టిక్ను ధ్వంసం చేశామన్నారు. అన్ని అనుమతులతో, పర్యావరణానికి హాని కలగకుండా కార్యక్రమాన్ని పూర్తి చేశామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *