బిఆర్ఎస్ కౌన్సిలర్ భూమిపై ఫారెస్ట్ దాడులు

సిరా న్యూస్,భద్రాద్రి;
బిఆర్ఎస్ కౌన్సిలర్ కొండపల్లి సరిత కుటుంబం పై కాంగ్రెస్ ప్రభుత్వ వేధింపులంటూ బిఆర్ఎస్ ఆరోపణ…
ఇల్లందు (మం) పోలంపల్లి సమీపంలో ఉన్న బిఆర్ఎస్ కౌన్సిలర్ కొండపల్లి సరిత, కొండపల్లి మనీ ల కోళ్ల ఫారం, మామిడి తోటను ఫారెస్ట్ అధికారులు ధ్వంసం చేసారు.ఫారెస్ట్ పరిధిలోని భూమిలో కోళ్ల ఫారం మామిడి తోటను పెంచుతున్నారని జెసిబి లతో, పోలీస్ ఫోర్స తో తెల్లవారుజామున వచ్చి ధ్వంసం చేసారు.భూమిపై కొండపల్లి కుటుంబానికి హక్కుపత్రాలు ఉన్నప్పటికీ ఫారెస్ట్ అధికారుల దాడులు చేస్తున్నారని సరిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.ఫారెస్ట్ అధికారులు బిఆర్ఎస్ కౌన్సిలర్ భూములను స్వాధీనం చేసుకునేందుకు దాడులు నిర్వహిస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఇల్లందు మండలం పోలపల్లి సమీపంలో ఉన్న కొండపల్లి సరిత, కొండపల్లి మనీలా భూములపై అధికారులు దాడులు నిర్వహించారు. రాత్రి సర్వే పేరుతో అధికారులు కొండపల్లి భూముల మీదికి వెళ్ళి క్రమంలో కొండపల్లి కుటుంబం అడ్డుకున్నది. ఆందోళన తీవ్రతరం కావడంతో ఫారెస్ట్ అధికారులు వెనుతిరిగారు.
ఈరోజు ఉదయాన్నే పోలిస్ ఫోర్స్ తో భూమిలో నిర్మాణం చేసి ఉన్న కోళ్ల ఫారం పై దాడులు ప్రారంభించారు. పొలంపల్లి సమీపంలోని 549 సర్వే నంబర్ గల భూమిలో ఉన్న ఇరువై ఎకరాల భూమిలో ఫారెస్ట్ పరిధిలో ఉందని ఫారెస్ట్ అధికారులు ఈ దాడులకు పాల్పడినట్లు తెలుతున్నారు. స్థలంలో నిర్మాణం అయి ఉన్న దాన్నిమొత్తం జెసిబి తో పోలీస్ ఫోర్స్ తో కొండపల్లి సరిత, మనీలా భూమిలో నాటిన మామిడి తోటను ధ్వంసం చేశారు. తమకు హక్కు పత్రాలు ఉన్న అన్యాయంగా తమ భూములను స్వాధీనం చేసుకునేందుకు ఫారెస్ట్ అధికారులు దాడులు చేశారని కొండపల్లి కుటుంబము ఆరోపిస్తుంది. ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు అవిశ్వాస తీర్మానంలో కొండపల్లి సరిత భర్త గణేష్ కీలక పాత్ర పోషించి.. కాంగ్రెస్ పార్టీ నేతలను మంత్రులను ముప్పు తిప్పలు పెట్టిన నేపథ్యంలో ఈ దాడులు జరుగుతున్నాయని బిఆర్ఎస్ ఆరోపిస్తున్నది.
కాంగ్రెస్ ప్రభుత్వం తమపై క్షపూరిత చర్యలకు పాల్పడుతుందని కొండపల్లి కుటుంబం ఆరోపిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *