సిరా న్యూస్,కరీంనగర్ జిల్లా;
మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు, సికాస వ్యవస్థాపక కమిటీ సభ్యుడు మహమ్మద్ హుస్సేన్ రియాజ్ సుధాకర్ అలియాస్ రమాకాంత్ ను జమ్మికుంటలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 30 సంవత్సరాలు సుదీర్ఘంగా ఉద్యమంలో అయన పనిచేసాడు. జార్ఖండ్ రాష్ట్రంలో అరెస్ట్ అయిన హుస్సేన్ 12 సంవత్సరాలు జైలు జీవితం అనుభవించాడు. అనారోగ్య కారణాలతో బెయిల్ పై విడుదలై 10 సంత్సరాలుగా జమ్మికుంటలో సాధరణ జీవితం గడుపుతున్నాడు. అతడిని వెంటనే విడుదల చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
====