సిరా న్యూస్,చొప్పదండి;
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన జల్ద శ్రీహరి సోమవారం మృతిచెందగా మంగళవారం మృతుని కుటుంబ సభ్యులను చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పరామర్శించి మృతికి గల కారణాలను తెలుసుకొని తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అనంతరం గత కొద్ది రోజుల క్రితం కొండాపూర్ గ్రామానికి చెందిన ఎలగుర్తి శంకర్ అనారోగ్యంతో మృతి చెందగా మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి మృతికి గల కారణాలను తెలుసుకొని తన ప్రగాఢ సానుభూతిని మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ తెలిపి ధైర్యంగా ఉండాలని అన్నారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ వెంట సర్పంచ్ ల ఫోరం మండల మాజీ అధ్యక్షులు పొనుగోటి కృష్ణారావు, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పులి వెంకటేష్ గౌడ్, పద్మశాలి సంఘం,ఐక్య సంఘం అధ్యక్షులు అంకం రాజేశం, టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కొత్తూరు స్వామి, మండల ఉపాధ్యక్షులు పర్లపల్లి ప్రభుదాస్, బోయినపల్లి మండల మాజీ కో ఆప్షన్స్ సభ్యులు అజ్జు,బి ఆర్ఎస్ పార్టీ యువజన విభాగం చొప్పదండి నియోజకవర్గ ఉపాధ్యక్షులు ఎండి సల్మాన్, నాయకులు మల్యాల మహిపాల్, గోలి ఐలయ్య, బండి రాజేందర్ రాచకొండ చంద్రమోహన్, ఆకునూరి మల్లయ్య, చల్లా లక్ష్మణ్, బొడ్డు మహేష్, గుండు రాజకుమార్,రమేష్, ఫ్రాoఛీస్, తదితర నాయకులు ఉన్నారు.