సిరా న్యూస్ అదిలాబాద్:
అప్పు తీర్చే మార్గం లేక పెంబి మండలంలోని యాపాల కూడా అనుబంధం నాయకుడా లో కస్తూరి చిన్న రాజన్న 45 సంవత్సరాలు ఆత్మహత్య చేసుకున్నాడు అని పెంబి ఎస్ఐ రజనీకాంత్ తెలిపారు. చిన్న రాజన్న పత్తి పంట వేయడానికి. అతని కుమార్తె వివాహం కోసం మూడు లక్షల రూపాయలు అప్పు చేశాడన్నాడు. అప్పు తీర్చే మార్గం లేక మనోవేదన గురై పత్తి చేనులో గుర్తుతెలియని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని. విషయం తెలుసుకొని 108 లో ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారని అన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు..