సిరాన్యూస్, కళ్యాణదుర్గం
స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం పై షార్ట్ ఫిలిం విడుదల: ఇన్ఫినిటీ ఫౌండేషన్ అధ్యక్షులు బద్దేనాయక్
జాతిపిత మహాత్మా గాంధీ ,లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా స్వచ్ఛభారత్ కార్యక్రమస్ఫూర్తితో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లక్ష్మంపల్లి ఉపాధ్యాయులు నగేష్ , వీరభద్ర ఆధ్వర్యంలో చిత్రీకరించినటువంటి స్వచ్ఛభారత్ డాక్యుమెంటరీ షార్ట్ మూవీ బుధవారం శాసనసభ్యులు అమిలినేని సురేంద్రబాబు చైతన్య స్ఫూర్తితో సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే నివాసం వద్ద వారి ప్రతినిధి ధర్మతేజ, ఏపిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు రాయల్ వెంకటేష్, మండల విద్యాశాఖ అధికారి వి.శ్రీధర్, వెల్ఫేర్ ఆఫీసర్ నాగరాజు, ఇన్ఫినిటీ ఫౌండేషన్ అధ్యక్షులు బద్దేనాయక్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఉపాధ్యాయులు కేవలం విద్యార్థులకు పాఠాలు చెప్పడమే కాకుండా సమాజ సంస్కరణ చైతన్య స్ఫూర్తి నింపడంలో భాగంగా ఈ షార్ట్ ఫిలిం ని విడుదల చేస్తున్నట్లు దీనికి మన స్థానిక ఎమ్మెల్యే వారి కార్యక్రమాలు, ప్రజాసేవలో అంకితమైన సామాజిక స్పృహ స్ఫూర్తిగా తీసుకొని తమ వంతు కర్తవ్యంగా ఈ షార్ట్ ఫిలిం ని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ద్వారా గ్రామీణ యువత ప్రజలు స్వచ్ఛభారత్ కార్యక్రమం పట్ల అవగాహన చేసుకుని ప్రజలందరూ వ్యక్తిగత పరిశుభ్రత గ్రామ పరిశుభ్రత ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తే దేశమంతా కూడా స్వచ్ఛభారత్గారూపొందించగలమని తెలిపారు. కార్యక్రమంలో ఏపిటిఎఫ్ నాయకులు బీసీ తిమ్మప్ప,బి. ఎర్రిస్వామి, ఈరన్న , తూమాటి శ్రీనివాసులు,కళాసమితి అధ్యక్షులు ఎర్రిస్వామి, పణిరాజు, షాషా వలి, విష్ణు , ప్రసాద్, ఇతర ఉపాధ్యాయ నాయకులు పాల్గొన్నారు