సిరాన్యూస్, ఉట్నూర్
ఉట్నూర్‌లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని మాజీ జడ్పీటీసీ చారులత రాథోడ్ స్వగృహంలో బుధవారం గాంధీ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశానికి బ్రిటిష్ వారి దాస్య శృంకలాలను తెంచడం మరియు భారత దేశ స్వాతంత్య్రం కోసం అహింసా మార్గంలో పోరాడి దేశానికి స్వేచ్ఛను ప్రసాదించారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ సలిముద్దీన్, ఎస్సీ, ఎస్టి, మనెరెటిగ్ కమిటీ కాటం రమేష్,సింగారే భారత్, మాజీ కో ఆప్షన్ నెంబర్ ముజీప్ ఖాన్, బిఆర్ఎస్, జిల్లా అధ్యక్షులు దరణీ రాజేష్, సుఫేన్ ఖాన్, భూమన్న, దావుల రమేష్, దుటా మహేందర్,కామెరి రాజు, హైమద్, అజ్జు, సోను రాథోడ్, సేక్ చాజ్, శ్రీకాంత్, రమేష్, అబిత్, పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.