స్వాతంత్ర్య సమరయోధుడు,
సిరా న్యూస్;
-నేడు ఆయన వర్ధంతి
స్వాతంత్ర్య సమరయోధుడిగా, భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపకుడిగా భోగరాజు పట్టాభి సీతారామయ్య సేవలందించారు. 24 నవంబర్ 1880 న మద్రాసుప్రెసిడెన్సీ రాష్ట్రములోని కృష్ణా జిల్లా ( పశ్చిమ గోదావరి జిల్లా, గుండుగొలను ) గ్రామములో జన్మించాడు . భారత జాతీయోద్యమ సమయంలో గాంధీజీ చే ప్రభావితుడై ఉద్యమంలో చేరి అతడికి సన్నిహితుడైకాంగ్రెస్లో ప్రముఖ స్థానం ఆక్రమించాడు. 1939లో గాంధీజీ అభ్యర్థిగా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీపడి నేతాజీ చేతిలో ఓడిపోయిననూ 1948లో పురుషోత్తమ దాస్ టాండన్ పై విజయం సాధించాడు.ఆ తర్వాత పార్లమెంటు సభ్యుడిగా, మధ్యప్రదేశ్ గవర్నర్గా పనిచేశాడు. రాష్ట్రం బయట పనిచేసిననూ తెలుగు భాషపై మమకారం కోల్పోలేదు. తను స్థాపించిన ఆర్థిక సంస్థలలో ఉత్తర ప్రత్యుత్తరాలుతెలుగులోనే జరగాలని సూచించాడు.పశ్చిమ గోదావరి జిల్లా గుండుకొలను గ్రామంలో 1880, నవంబర్ 24 న బ్రాహ్మణుల ఇంటిలో పట్టాభి జన్మించాడు. వారి ఇంట్లో ప్రతి సంవత్సరం రామపట్టాభిషేకంజరిపే ఆచారం ఉండేది. అందుకే తల్లిదండ్రులు పట్టాభి సీతారామయ్య అనే పేరు పెట్టినారు. ఇతని తండ్రి భోగరాజు వెంకట సుబ్రహ్మణ్యం పంతులు గుండుగొల్లు గ్రామ కరణంగా పనిచేసేవాడు. సీతారామయ్యకుఒక అన్న ఆరుగురు అక్కచెల్లెళ్ళు ఉన్నారు. ఇతని నాలుగవయేటనే తండ్రి మరణించడంతో కుటుంబభారం తల్లి గంగమ్మ మీద పడింది. పిల్లల విద్యాభ్యాసం కొరకు ఆమె తన కుటుంబాన్ని ఏలూరుకుతరలించింది. ఇతడు తన ప్రాథమిక విద్యను ఏలూరు లోని మిషన్ హైస్కూలులో చదివాడు. అక్కడ మెట్రిక్యులేషను పూర్తి అయిన తరువాత బందరులోని నోబుల్ కాలేజీలో ఎఫ్.ఎ. పరీక్ష ప్రథమ శ్రేణిలోఉత్తీర్ణుడైనాడు.