సిరా న్యూస్,బీజాపూర్;
ఛత్తీస్ ఘడ్ అడవుల్లో ఎలిమిడి వద్ద జరిగిన ఎన్కౌంటర్ ఆపరేషన్ లో పాల్గొన్న తెలంగాణ గ్రేహౌండ్స్ పోలీసులు తిరుగు ప్రయాణంలో అడవిలో చిక్కుకుపోయారు. ములుగు, వాజేడు ప్రాంతంలో వాగులు ఉదృతంగా ప్రవహించడంతో నాలుగు రోజులు పాటు అడవిలోనే నరకయాతన పడ్డారు. సోమవారం వర్షాలు తగ్గుముఖం పట్టడంతో వారిని హెలికాప్టర్ ద్వారా వాజేడు తీసుకొచ్చి ఆసుపత్రికి తరలించారు. కమాండోలు పడిన కష్టాల వీడియో వైరల్ అయ్యాయి.