సిరా న్యూస్,గుల్బర్గా;
గుల్బర్గా జిల్లాలో కమలాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, బోలెరో వాహనం ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు భార్గవ కృష్ణ (55), భార్య సంగీత (45), కుమారుడు ఉత్తమ్ రాఘవ (28), డ్రైవర్ రాఘవేంద్ర గౌడ్ మృతి చెందారు. మృతులు హైదరాబాద్ యూసుఫ్ గూడ వాసులుగా గుర్తించారు. కారు నెంబర్ టీఎస్ 08 ఈబీ 2030 లో గానుగాపూర్ దత్తాత్రేయ క్షేత్రానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతదేహాలను కమలాపూర్ ఏరియా హాస్పిటల్ కి తరలించారు.