మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
సిరా న్యూస్,హైదరాబాద్;
బేగంపేట లోని జవహర్ జనతా, భర్తన్ కాంపౌండ్ లలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం పర్యటించారు. విద్యుత్ బిల్లులు, నల్లా బిల్లులు చెల్లించాలంటూ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని స్థానికులు పిర్యాదు చేసారు. తలసాని మాట్లాడుతూ జీరో విద్యుత్ బిల్లు, ఉచిత నీటి సరఫరా చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. బిల్లులు చెల్లించాలని పేద ప్రజలను ఇబ్బంది పెట్టడం తగదని అన్నారు. అర్హులైన వారు బిల్లులు చెల్లించొద్దు. సీజనల్ వ్యాధులు ప్రభలుతున్న నేపథ్యంలో బస్తీలలో పారిశుధ్య నిర్వహణ ను నిత్యం పర్యవేక్షించాలని అన్నారు.