సిరా న్యూస్,బెల్లంపల్లి;
తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, తెలుగు టీవీ రచయితల సంఘం సంయుక్త నిర్వహణలో మంచిర్యాల జిల్లా సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఈ నెల 20 న ఔత్సాహిక సినీ, టీవీ రచయితల ఉచిత శిక్షణ శిబిరాన్ని మంచిర్యాల కలెక్టర్ కార్యాలయం లో ఉదయం 10 గంటలకు ఏర్పాటు చేస్తున్నట్లు మంచిర్యాల జిల్లా సాంస్కృతిక సమాఖ్య ఛీఫ్ కోఆర్డినేటర్ హనుమాండ్ల మధుకర్,ఉమ్మడి అదిలాబాద్ జిల్లా సాంస్కృతిక సమాఖ్య పూర్వ ప్రధాన కార్యదర్శి శిక్షణ శిబిరం చీఫ్ కోఆర్డినేటర్ అభినవ సంతోష్ కుమార్ , హనుమండ్ల మధుకర్ ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రముఖ సినీ టీవీ దర్శకులు , నిర్మాత , తెలుగు టెలివిజన్ ఫెడరేషన్ స్థాపక అధ్యక్షులు నాగబాల సురేష్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఈ శిక్షణ శిబిరంలో ప్రముఖ సిని దర్శకులు వి.ఎన్ ఆదిత్య,ప్రేమ్ రాజ్ , నెల్లుట్ల ప్రవీణ్ చంద్ర, చంద్ర మహేష్ , ప్రముఖ రచయిత తోటపల్లి సాయినాథ్, యువ దర్శకులు మానస్ దండనాయక , స్క్రీన్ ప్లే రచయిత శ్రీశైల మూర్తి, తదితరులు పాల్గొని శిక్షణ ఇస్తారని వారు తెలిపారు.
సినీ, టీవీ రంగంలో రాణించాలనే వారికి మూల కథ, సన్నివేశ ప్రాధాన్యత, పాత్రల రూపకల్పన, ప్రారంభ, ముగింపు సన్ని వేషాలు, 24 శాఖలపై అవగాహన, స్క్రీన్ ప్లే తదితర విషయాలపై అవగాహన కల్పిస్తారని వారు పేర్కొన్నారు. జిల్లాలోని ఔత్సాహికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. వివరాల కోసం అభినవ సంతోష్ కుమార్ 8074771108 ,హనుమాండ్ల మధుకర్ 9908232303 సంప్రదించాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి హజరవుతారని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా నృత్య కళా సమాఖ్య అధ్యక్షులు రాకం సంతోష్, సినీ టీవీ కొరియోగ్రాఫర్ పంబాల మల్లేష్, తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు జంజిరాల దినేష్ కుమార్, సీనియర్ కళాకారులు బొంకురి రాంచందర్, మిట్టపల్లి మల్లేష్, బొప్పనపెల్లి రాజేష్, బోంకురి రవి కుమార్, పంబాల రంజిత్ అభినాశ్ తదితరులు పాల్గొన్నారు.