మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం ఇచ్చిన సిపిఎం నాయకులు…
మంచినీటి కనెక్షన్ కుళాయిలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన కమిషనర్….
మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేయకపోతే ఆందోళన చేపడతాం..
సిపిఎం పట్టణ నాయకుడు ముడి యం చిన్ని.
సిరా న్యూస్,బద్వేలు ;
బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య కాలనీలో సర్వేనెంబర్1008. లో నివాసముంటున్న వంద కుటుంబాలకు మంచినీటి కొళాయి కనెక్షన్ ఇవ్వాలని సిపిఎం బద్వేల్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య కాలనీ ప్రజలతో కలిసి బద్వేల్ మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా సిపిఎం బద్వేల్ పట్టణ నాయకుడు ముడియం చిన్ని మాట్లాడుతూ…. బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య కాలనీలో దాదాపు 100 కుటుంబాలు మంచినీటి సౌకర్యం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని వారికి మంచినీటి కుళాయి కనెక్షన్ ఇవ్వడంలో గత మున్సిపల్ కమిషనర్ గారు విఫలమయ్యారని అక్కడ ఉన్నటువంటి ప్రజలు మంచినీళ్ల కోసం పొలాలలోకి వెళ్లి నీళ్లు తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుందని అనేక దపాలుగా మున్సిపల్ అధికారులకు తెలియజేసినప్పటికీ వారు పట్టించుకోకపోవడం దారుణం అన్నారు సుందరయ్య కాలనీలో దాదాపు 100 కుటుంబాలు పేదలు నివాసం ఉన్నారని పేదలు చందాలు వేసుకొని పైప్ లైన్స్ ఏర్పాటు చేసుకున్నామని కనెక్షన్ ఇవ్వడంలో మున్సిపల్ అధికారులు విఫలమయ్యారని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పుడు ఇచ్చినటువంటి కమిషనర్ గారైన మా సమస్యను పరిష్కరించి మాకు మంచినీటి కుళాయి కనెక్షన్ ఇప్పించి మాకు నీటి సమస్యను పరిష్కరించాలని వారు కోరారు ఇప్పుడు ఉన్న మున్సిపల్ కమిషనర్ గారు స్పందించి తక్షణమే సుందరయ్య కాలనీలో ఉన్నటువంటి 100 కుటుంబాలకు పైప్లైన్ తో పాటు కుళాయి కనెక్షన్లు కూడా ఏర్పాటు చేస్తామని మంచినీటి సమస్యను పరిష్కరించి ప్రజలను ఇబ్బందులు పడకుండా చూస్తామని హామీ ఇవ్వడం జరిగింది సుందరయ్య కాలనీకి మంచినీటి కనెక్షన్ ఏర్పాటు చేయకపోతే పేద ప్రజలతో కలిసి మున్సిపల్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేపడతామని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎస్ కే ఆదిల్ మోక్షమ్మ అనంతమ్మ కైరుని బి మస్తాన్ బి బాలమ్మ రామలక్ష్మమ్మ ఫాతిమా గంగయ్య గంగాదేవి దేవి బీబీ తదితర కాలనీ ప్రజలు పాల్గొన్నారు