సిరా న్యూస్,కంచికచర్ల;
ప్రభుత్వ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఉచిత ఇసుక విధానంలో గందరగోళం ఘర్షణ వాతావరణ నెలకొంది. తాజాగా కంచికచర్ల మండలం కీసర స్టాక్ పాయింట్ లో ఘర్షణ చోటు చేసుకుంది. కంచికచర్ల మండల వైకాపా జెడ్పీటీసీ భర్త వేల్పుల రమేష్ సోదరుడు అగడాలకు హద్దు లేదని టిప్పర్ డ్రైవర్లు ఆరోపించారు. వైకాపా నాయకులే రెచ్చిపోతు అధికారులపై అసభ్యకర దూషణకు దిగుతు దాడులకు తెగబడుతున్నారని ఆరో్పించారు. ఇసుక స్టాక్ యార్డ్ లో సీరియల్ తో సంబంధం లేకుండా తన వాహనానికి ముందుగా ఇసుక నింపాలంటూ ఘర్షణ కు దిగారడు. అక్కడే ఉన్న కోంతమంది టిప్పర్ డైవర్ వైకాపా నాయకుడి సోదరడుని లు నిలదీయడంతో ఘర్షణ వాతావరణం నెలకొని ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు