సిరా న్యూస్, సొనాల:
+ గత 8 ఏండ్లుగా రక్తదానం
+ ఆదర్శంగా నిలుస్తున్న యువకులు
‘స్నేహానికన్నా మిన్న లోకాన లేదురా!’ అని ఓ సినీ గేయరచయిత చెప్పిన మాటలను నిజం చేసి చూపిస్తున్నారు ఆదిలాబాద్ పట్టణానికి చెందిన కొంత మంది యువకులు. తమ స్నేహితుడు వినిత్ రావ్ చనిపోయి ఏండ్లు గడుస్తున్నప్పటీ, అతని జ్ఞాపకార్థం ప్రతీ సంవత్సరం రక్తదానం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. వినిత్ రావ్ మిత్రులు సూది నరేష్, ధరంపాల్, వినీల్ రావ్‌లు ఆదిలాబాద్ పట్టణంలోని రిమ్స్‌లో శనివారం రక్తదానం చేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత 8 సంవత్సరాలుగా తమ స్నేహితుడు జ్ఞాపకార్థం రక్తదానం చేస్తున్నట్లు తెలిపారు. స్వంత కుటుంబంలోనే నిత్యం కలహాలతో ఒకరినొకరు ద్వేషించుకుంటున్న ఈ రోజుల్లో స్నేహితుడి కోసం ప్రతీ ఏట రక్తదానం చేస్తున్న ఈ యువకులకు స్థానికులు హాట్సాప్ చెబుతున్నారు.