Friends Forever: పక్షవాతంతో బాధపడుతున్న మిత్రునికి ఆర్థిక సహాయం

సిరా న్యూస్, చిగురుమామిడి:

పక్షవాతంతో బాధపడుతున్న మిత్రునికి ఆర్థిక సహాయం

కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామానికి చెందిన దొబ్బల మల్లయ్యకు, 1987–88 పదవ తరగతి బ్యాచ్‌కు చెందిన అతని మిత్రులు ఆర్థిక సహాయం అందించారు. మల్లయ్య గత కొంత కాలంగా పక్షవాతంతో మంచానికే పరిమితం కాగా, వైద్యం చేయించుకోడానికి డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. విషయం తెల్సుకున్న అతని మిత్రులు చింతపూల అంజయ్య, అంబటి బిక్షపతి, బి లక్ష్మయ్య, నాగయ్య, బాలయ్య, తిరుపతి, రవి, కొమురయ్య, పెద్ద లక్ష్మయ్య, కేవిఎన్‌ మూర్తి, ఎండీ రసూల్, మహేంద్ర చారి, ఏ మహేందర్, వి అంజయ్య, అంబటి రవీందర్, రాజమల్లయ్య, పర్శరాములు, రాజా, శ్రీలత, సురేందర్‌ రెడ్డి, ప్రభాకర్‌ రెడ్డి, రాంరెడ్డి, తదితరులు, శుక్రవారం మల్లకి ఇంటికి వెళ్లి అతన్ని పరామర్శించారు. అనంతరం మల్లయ్య భార్య పుష్పలత, కుమార్తెలు ఉషారాణి, చందన రాణిలకు రూ. 30వేల ఆర్థిక సహాయం అందించారు. కాగా తామంత అండగా ఉన్నామని, అధైర్యపడవద్దని భరోసా కల్పించారు. ఈ మేరకు మల్లయ్య కుటుంబ సభ్యులు, మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *