సిరా న్యూస్, బేల
గాడగే మహారాజ్‌ను యువత ఆదర్శంగా తీసుకోవాలి
* పలువురు వక్తలు
* ఘనంగా గాడగే మహారాజ్ జయంతి
గాడగే మహారాజ్‌ను యువత ఆదర్శంగా తీసుకోవాలని పలువురు వక్తలు అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా బేలా మండల కేంద్రం లో స్థానిక గాడగే మహారాజ్ చౌక్ లో ఆయన జయంతిని నిర్వహించారు. అనంతరం గాడగే మహారాజ్ విగ్రహానికి పలువురు నాయకులు పూలమాలలు వేసి పూజలు చేశారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ స్వచ్చతక అంటేనే గుర్తుకొచ్చేది ఈ మహా అనుభవుడే అన్నారు. సమాజం కోసం తన భజన కీర్తనలు బోధనలు,సమాజం మార్పు కోసం దోహదం వస్తున్నాయని వివరించారు. ఆ మహనీయునడు చూపించిన మార్గం లో యువత తో సహా ప్రతి ఒక్కరూ ఆదర్శం గా తీసుకొని ఆయన మార్గంలో నడవాలని పలువురు వివరించారు. కార్యక్రమంలో దేవన్న, ప్రమోద్ కుమార్, రపెళ్ళి శివ కుమార్ నాందేవ్ కాబ్లే , తదితర నాయకులు పాల్గొన్నారు.