సిరా న్యూస్, జైనథ్:
ఖబర్దార్ బాల్క సుమన్… నోరు అదుపులో పెట్టుకో…
– కాంగ్రెస్ నాయకులు గడ్డం జగదీశ్ రెడ్డి వార్నింగ్
– బాల్క సుమన్ పై కేసు నమోదుకు డిమాండ్
– కాంగ్రెస్ నాయకులతో కలిసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ నాయకులు గడ్డం జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రంలో నిరసన తెలియజేశారు. సీఎం రేవంత్ రెడ్డిని చెప్పుతో కొడతానని బాల్క సుమన్ అనడం బాధాకరమన్నారు. బాల్క సుమన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అనంతరం స్థానిక ఎస్సై పురుషోత్తంను కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని పరుష పదజాలంతో దూషించిన బాల్క సుమన్ పై వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బాల్క సుమన్ నోరు అదుపులో పెట్టుకోవాలని, ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కొడిచెర్ల సుదర్శన్, నాయకులు అల్లూరి అశోక్ రెడ్డి, సురేష్ రెడ్డి, పిడుగు స్వామి, తదితరులు పాల్గొన్నారు.