Gajanan: ఏజెన్సీ భూమి ఆక్ర‌మించిన వారికి నోటీసులు  : గ్రామపంచాయతీ కార్యదర్శి జి. గజానన్

సిరాన్యూస్‌, బేల
ఏజెన్సీ భూమి ఆక్ర‌మించిన వారికి నోటీసులు  : గ్రామపంచాయతీ కార్యదర్శి జి. గజానన్

ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో గల బూరాన్పూర్ శివారంలో సర్వే నంబర్ 29/ఏ లో ఉన్న భూమిని కొందరు 1/70 చట్టాన్ని ఉల్లంఘించి అతిక్రమించారు. శుక్ర‌వారం ఆ భూమి ఆక్ర‌మించిన వారిపై బేల‌ గ్రామపంచాయతీ లిఖితపూర్వకంగా నోటీసులు జారీ చేశారు.ఈ సంద‌ర్బంగా బేల‌ గ్రామపంచాయతీ కార్యదర్శి జి. గజానన్ మాట్లాడుతూ బురాన్పూర్ శివారం లో గల కబ్జా చేసిన వారు తమ గుడిసెలను తీసివేయాలని అన్నారు. ఏజెన్సీ భూమిలో అర్హులైన వారు ఉంటే తమ ఎస్టీ సర్టిఫికెట్ గ్రామపంచాయతీకి సమర్పించాలని అన్నారు. బురాన్ పూర్ శివారంలో కబ్జా చేసిన ఇట్టి భూమి కోర్టు వివాదంలో ఉంది అని వారితో తెలిపారు. భూమి అతిక్రమించిన వారికి నోటీసులు ఇస్తూ మూడు రోజుల వ్యవధిలోపల వారి గుడిసెలను వారే తీయాలని అన్నారు. లేని యెడల గ్రామపంచాయతీ తొలగిస్తుంద‌ని తెలిపారు. వారితోపాటు కారోబారి గజానన్ దేశ్ముఖ్, గ్రామపంచాయతీ సిబ్బంది ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *