సిరా న్యూస్, బేల
బదిలీపై వెళ్తున్న గజానన్ ఉపాధ్యాయుడికి సన్మానం
ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని గూడ గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తూ ఇటీవల బదిలీపై వెళ్లిన గజానన్ ఉపాధ్యాయుడిని గురువారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని ఉపాధ్యాయులు, విద్యార్థులు, గూడ గ్రామ సర్పంచ్ ఠాక్రే తన్బ ఉపాధ్యాయుడిని శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు గావండే ఘనీశం, మండల యూత్ అధ్యక్షుడు గోడే అవినాష్ , ఉప సర్పంచ్ గోడే ధైరేవాన్ , ఠాక్రే సంతోష్ , బి మరోతి, అనిల్, దశరథ్, అనిల్, రాజు, గూడ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.