సిరాన్యూస్,ఓదెల
దేవరకొండ రామ్మూర్తి చూపు సజీవం..
* నేత్రదానంతో ఇద్దరికి చూపు
* అభినందించిన సదాశయ ఫౌండేషన్ ప్రతినిధులు
* నేత్రాలను సేకరించిన ఎల్ విపి టెక్నీషియన్ గాజుల సతీష్
పెద్దపల్లి జిల్లా,ఓదెల మండల కేంద్రానికి చెందిన దేవరకొండ రామ్మూర్తి గుండెపోటుతో శుక్రవారం రాత్రి మృతి చెందారు. ఈసందర్బంగా సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులకు నేత్రదానంపై అవగాహన కల్పించారు. దీంతో కుటుంబ సభ్యులు ఒప్పుకోవడంతో పెద్దపల్లి జిల్లా సదాశయ ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి మెరుగు భీష్మాచారి ఆధ్వర్యంలో వరంగల్ ఎల్ వీపీ టెక్నీషియన్ గాజుల సతీష్ సహకారంతో నేత్ర సేకరణ చేసి హైదరాబాద్ ఎల్వీపీ ఐ బ్యాంక్‌కు పంపించారు.ఇద్దరు అంధులకు చూపును ప్రసాదించిన భార్య మణెమ్మ, కుమారులు కోడండ్లు కోడండ్లు ప్రభాకర్.స్వర్ణ , సతీష్ శిరీష లకు, కూతుర్లు అల్లుండ్లు దినేష్ జ్యోతి, సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు శ్రవణ్ కుమార్ ప్రధాన కార్యదర్శి లింగమూర్తి జాతీయ కార్యదర్శి.ముఖ్య సలహాదారులు నూక రమేష్,,ప్రచార కార్యదర్శి వాసు.మెరుగు.సారంగం .అల్లం సతీష్ డా. వేణు, లగిశెట్టి చంద్రమౌళి, క్యాతం,వెంకటేశ్వర్లు. డాక్టర్ ఇప్పనపల్లి వెంకటేశ్వర్లు .క్యాతం మల్లేశం .బంధు మిత్రులు అభినందనలు ధన్యవాదాలు తెలిపారు.