సిరాన్యూస్, ఇచ్చోడ
గాంధీనగర్‌లో రోడ్డుపక్కనే చెత్తాచెదారం…
పారిశుధ్యం నిర్వహణ లోపంతో గ్రామస్తులు ఇక్కట్లు ఎదురవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని జాతీయ రహదారి 44 గాంధీనగర్ గ్రామం నుండి బోరిగామ గ్రామం వైపు వెళ్లే రోడ్డు పక్కనే చెత్తాచెదారం డంప్ చేస్తుండడంతో అక్కడ మినీ డంపింగ్‌యార్డులు దర్శనమిస్తున్నాయి. బహిరంగ ప్రదేశాలలో చెత్త కనిపించకుండా చేస్తున్నామని అధికారులు గొప్పలకు పోతున్నా క్షేత్ర స్థాయిలో ఆ పరిస్థితికి భిన్నంగా ఉంది. ఈ మార్గంలో ప్రయాణిస్తుంటే దుర్వాసన వస్తోందని ప్రయాణికులు, వాహనదారులు వాపోతున్నారు. కొందరు గేదెల పేడ, పశుగ్రాసాన్ని తీసుకువచ్చి రోడ్డు పక్కన పడేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వీటిని తొలగించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.