సిరా న్యూస్,జగిత్యాల;
దేశ స్వాతంత్రం పోరాటంలో ప్రాణాలర్పించిన మహనీయుల త్యాగాలను స్మరిస్తూ, గాంధీ వర్ధంతి సందర్భంగా
జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీస్ అధికారులుఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.. ఈ సందర్భంగా రెండు నిమిషాల పాటు పోలీస్ అధికారులు, సిబ్బంది మౌనం పాటించారు. దేశం కోసం, దేశ ప్రజలకు స్వేచ్చ స్వాతంత్య్రం కల్పించడం లక్ష్యంగా వేలాది మంది స్వాతంత్ర్య పోరాటంలో పాలుపంచుకొని తమ ప్రాణాలను సైతం అర్పించారని, వారి త్యాగ ఫలితంగానే నేడు మనమంతా ఆ ఫలాలను అనుభవిస్తున్నామని చెప్పారు. అలాంటి త్యాగధనులను స్మరించుకోవడం దేశ పౌరులుగా మనందరి బాధ్యత అన్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు (ఏఆర్)భీమ్ రావు, జనార్ధన్ రెడ్డి,ఏవో అమర్నాథ్,ఆర్ఐ లు జానీమియా, రామకృష్ణ వేణు,ఆర్ ఎస్సైలు,డీపీవో సాయుధ ధళా పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.