సిరా న్యూస్,కాణిపాకం;
ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాక క్షేత్రంలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఉత్సవాల్లో బాగంగా రాత్రి కల్పవృక్ష వాహనంపై వినాయకస్వామి విహరించారు.ఆలయ ఈవో, అర్చక, వేదపండితులు, సిబ్బంది ఉభయదారులుగా వ్యవహరించారు. ఉదయం మూల విరాట్‌కు పంచామృత అభిషేకం నిర్వహించారు. అనంతరం పాల కలశాలను తలపై పెట్టుకొని కాణిపాక పురవీధుల్లో ఊరేగించాక కల్యాణ వేదిక వద్ద సిద్ధి,బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి ఉత్సవర్లకు క్షీరాభిషేకం నిర్వహించారు. రాత్రి ఉభయ వరస రావడంతో అణివేటి మండపంలో సిద్ధి, బుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామి ఉత్సవర్లకు పూజలు నిర్వహించి ధూప, దీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం కల్పవృక్ష వాహనంపై ఉంచి పుర వీధుల్లో ఊరేగించారు.