సిరా న్యూస్,అన్నమయ్య;
రైల్వే కోడూరు పట్టణంలో బలిజ వీధిలో నిర్వహిస్తున్న గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా జరుగుతున్నది. ఇందుకు సంబంధించి భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. వేలాది మంది భక్తులు తండ్డోపతండాలుగా తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. జాతరకు ముందు రోజున అనేక రకాల దేవతల వేషధారణలతో ఊరేగింపు నిర్వహించారు. పట్టణాన్ని విద్యుత్ దీపాలతో సుందరీకరంగా అలంకరించారు. గురువారం ఉదయం అమ్మవారిని తయారు చేసుకుని ఊరేగింపుగా నలువీధులలో తిప్పుకుంటూ గుడి వద్దకు తీసుకువచ్చి విగ్రహాన్ని ప్రతిష్టించారు. అమ్మవారిని దర్శించుకొనుటకు ప్రత్యేక క్యూ లైన్ లను ఏర్పాటు చేశారు. భక్తులకు కావలసిన అన్ని రకాల వసతులను భారీ బందోబస్తులను ఏర్పాటు చేసినట్టు ఆలయ కమిటీ చైర్మన్ పోకల సుబ్బరాయుడు తెలియజేశారు.
====