సిరాన్యూస్, బోథ్:
నారా మనోహర్ ను సన్మానించిన మార్కెట్ కమిటీ చైర్మన్ బి గంగారెడ్డి
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా విధులు నిర్వహించిన నారా మనోహర్ బదిలీపై పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మార్కెట్ కు వెళ్తున్నారు. ఈసందర్బంగా శనివారం బదిలీపై వెళ్తున్న కార్యదర్శిని మార్కెట్ కమిటీ చైర్మన్ బి గంగారెడ్డి సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మార్కెట్ కమిటీ ఆదాయం పెంపులో కార్యదర్శిగా కృషి చేశారని పేర్కొన్నారు. మార్కెట్ ఆస్తులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పాడవకుండా చూశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పసుల చంటి, మెరుగు భోజన్న, నాగేందర్, గడ్డల నారాయణ, సాయన్న తదితరులు ఉన్నారు.