సిరాన్యూస్, సైదాపూర్
జాతీయ జెండాను ఎగరేసిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్
* ఆవతరణ దినోత్సవంలో సైదాపూర్ బీఆర్ఎస్ నాయకులు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా తీగలగుట్టపల్లి కేసీఆర్ ఫాంహౌస్ లో బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా శానసభ్యులు గంగుల కమలాకర్ సోమవారం జాతీయ జెండాను ఎగురవేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన పాల్గొని పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమం లో సైదాపూర్ ఎంపీపీ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సోమారపు రాజయ్య, వెన్నంపల్లి సింగిల్ విండో చైర్మన్ బిల్లా వెంకట్ రెడ్డి, మాజీ సర్పంచ్ పైడిపల్లి సుశీల తిరుపతి గౌడ్, మాజీ సర్పంచ్ బత్తుల కొమురయ్య, సోషల్ మీడియా కన్వినర్ చల్లూరి రాజు తదితరులు పాల్గొన్నారు.