Ganugabanda Ramalayam: గానుగబండలో ప్రత్యేక పూజలు

సిరా న్యూస్, సూర్యపేట:

గానుగబండలో ప్రత్యేక పూజలు

సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలోని గానుగబండ గ్రామంలోని రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం ఉదయం నుంచే ఆలయంలో పండగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా రాములోరి విగ్రహాలను పల్లకిలో ప్రతిష్ఠించి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం ఆలయంలో హోమాది కార్యక్రమాలు నిర్వహించారు. సీతాసమేతుడైన రాములోరికి నూతన వస్త్రాలను అలంకరించి, అభిషేకాలు గావించారు. అనంతరం మహాన్నదానం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో ఎంపిటీసీ పాకాల రమేష్, నాయకులు అంజిరెడ్డి నాగేంద్రబాబు, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *