సిరా న్యూస్,తిరుమల;
రథసప్తమి వేడుకలు ప్రతి ఆలయం లోనూ ఘనంగా జరుగుతున్నాయి. గరుడ వాహనాన్ని బ్రహ్మోత్సవాల సమయంలోనే అత్యంత వైభవంగా తిరుమలలో చూస్తాం. అయితే ఇవాళ రథసప్తమి కనుక టీటీడీ ఒకరోజు బ్రహ్మోత్సవాన్ని నిర్వహిస్తుంది. సప్త వాహనాలపైన తిరుమల శ్రీవారు… భక్తులకి దర్శన మిస్తున్నారు. ఇందులో భాగంగా గరుడ వాహనం పై తిరుమల శ్రీవారు భక్తులకు కటాక్షించారు. గరుడ వాహనాన్ని చూడ్డానికి తిరుపతి స్థానికులతో పాటు, తిరుమల కి వెళ్ళిన భక్తులు పెద్ద సంఖ్యలో నాలుగు మాడ వీధుల్లోకి తరలి రావడం జరిగింది. తోపులాటలు తోక్కిసలాటలు జరగకుండా టీటీడీ అధికారులు…. విజిలెన్స్, పోలీసులు కట్టిదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. భారీ క్యూ లైన్లు భారీ గేట్స్ ఏర్పాటు చేయడం కారణంగా వాహన ఊరేగింపు సేవ అత్యంత వైభవంగా జరిగింది.