సిరా న్యూస్,పెద్దపల్లి;
ఇటీవల ట్రస్మా ఆధ్వర్యంలో నిర్వహించిన సైంటిఫిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇంటర్ స్టేట్ ఒలంపియాడ్ -2024 లో పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్ కి చెందిన భూసారపు విక్షిత్ (8 వ తరగతి) స్టేట్ ఫస్ట్ ర్యాంక్, శిఫానా అంజుమ్ (9వ తరగతి) మరియు కొమురవెల్లి కార్తీక్ (6వ తరగతి) లు స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించగా మరో12 మంది స్టేట్ ర్యాంక్ లు సాధించిన విద్యార్థులను గాయత్రి విద్యా సంస్థల ఛైర్మన్ అల్లెంకి శ్రీనివాస్ అభినందించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ రజనీ దేవి మీడియాతో మాట్లాడుతూ పిల్లలలో పోటీతత్వం, పరీక్షల పట్ల అవగాహన, విషయ పరిజ్ఞానం పెంపొందించాలనే ఆలోచనతో విద్యార్థులు ఒలంపియాడ్ పరీక్షలు రాసేలా ప్రోత్సహిస్తున్నా మని అన్నారు. ఈ పరీక్షల ద్వారా పిల్లలకు ఓఎంఆర్ షీట్ అంటే ఏమిటి, వివరాలను అందులో ఎలా రాయాలి, అలాగే పోటీ పరీక్షల్లో ఎలాంటి ప్రశ్నలు వస్తాయి, జనరల్ నాలెడ్జ్, రీజనింగ్ మరియు మెంటల్ ఎబిలిటీ విషయాల మీద పిల్లలకు ఒక అవగాహన వచ్చి, భవిష్యత్ లో ఉండే పోటీని తట్టుకోవాలంటే మనం ఇంకా ఎంత కృషి చేయాలి, వివిధ విషయాల పట్ల మనకున్న జ్ఞానం స్థాయిని తెలుసుకొని ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో స్టేట్ ర్యాంక్ సాధించిన విద్యార్థినీ విద్యార్థులకి సర్టిఫికెట్లు అందజేసి విద్యార్థులను, ప్రోత్సహించిన టీచర్స్ రజియుద్దీన్, నాసియాలను అభినందించారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ రజనీ శ్రీనివాస్, ప్రిన్సిపాల్ విజయ్ పాల్గొన్నారు.