సిరా న్యూస్, చిగురుమామిడి
జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న పేరు ఆమోదించడం హర్షణీయం
* జడ్పీ ఫ్లోర్ లీడర్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గీకురు రవీందర్
జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న పేరు ఆమోదించడం హర్షణీయమని జెడ్పి ఫ్లోర్ లీడర్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గీకురు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జనగామ జిల్లాను సర్ధార్ సర్వాయి పాపన్న జిల్లాగా ప్రకటించడం పట్ల బీసీ సంక్షేమ సంఘం నాయకులు హర్షం వెలిబుచ్చారు.శుక్రవారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో వారు మాట్లాడారు.బహుజన చక్రవర్తి సర్వాయి పాపన్నకు గుర్తుగా రాష్ట్ర కెబినెట్ ఆమోదం తెలుపడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమాక్ర, మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ లతో పాటు కేబినెట్ కు ధన్యవాదములు తెలిపారు. ఈ సందర్భంగా జెడ్పి ఫ్లోర్ లీడర్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గీకురు రవీందర్ మాట్లాడుతూ సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ అనన్య సామాన్యమైన తెగువకు తెగింపుకు మారు పేరుగా, మొక్కవోణీ ధైర్యశాలిగా, వెట్టి చాకిరీ విముక్తి కోసం, బానిస బ్రతుకుల బాగుకోసం పాపన్న ఉద్యమించిన తీరు తెలంగాణ ప్రజలకు స్ఫూర్తి దాయకమన్నారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘము మండల అధ్యక్షులు శ్రీ రామోజు రాజ్ కుమార్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ బుర్ర శ్రీనివాస్ గౌడ్, బీసీ సంఘము నాయకులు తాళ్లపెల్లి తిరుపతి, బీసీ సంఘం యువత విభాగం ప్రధాన కార్యదర్శి గట్టు ప్రశాంత్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.