సిరాన్యూస్,భైంసా
గీతం ప్లే స్కూల్లో బోనాల పండుగ
నిర్మల్ జిల్లా భైంసా పట్టణ కేంద్రం లోని గీతం ప్లే అండ్ ప్రైమరీ స్కూల్లో బోనాల పండుగ సంబరాలను శనివారం ఘనంగా నిర్వహించారు.ఈసందర్బంగా బోనాల పండుగ సందర్భంగా చిన్నారులు అమ్మోరు తల్లి పోతరాజుల వేషాధారణలతో చేసిన నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.