సిరా న్యూస్,ములుగు;
మేడారం మహాజాతరకు బుధవారం అంకురార్పణ జరిగింది. గుడిమెలిగే పండుగతో జాతర తొలిఘట్టం మొదలవుతుంది. మహా జాతరకు రెండు వారాల ముందు గుడిమెలిగే తంతు నిర్వహిస్తారు. పూజారుల కుటుంబాల ఇండ్ల శుద్ది కార్యక్రమం జరిగింది. తరువాత మేడారంలోని సమ్మక్క, కన్నేపల్లిలోని సారలమ్మ , కొండాయిలోని గోవిందరాజు, పూనుగొండ్లలోని పగిడిద్దరాజు ఆలయాలను ఆదివాసీ ఆచార సంప్రదాయాల ప్రకారం పూజారులు శుద్ది చేసారు. సమ్మక్క గద్దెను ఎర్రమట్టితో అలుకు చల్లి రంగుల ముగ్గులతో అలంకరణ చేసారు.