రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవ్వండి

రాష్ట్రంలో మళ్లీ జగనన్నే ముఖ్యమంత్రి కావాలి
అరకు ,పార్లమెంట్ సభ్యురాలు నియోజకవర్గం సమన్వయకర్త గొడ్డేటి మాధవి పిలుపు
 సిరా న్యూస్,అరకులోయ;
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ సీఎం గా చేయడమే మన ముందున్న లక్ష్యమని అరకు పార్లమెంటు సభ్యురాలు అరకు నియోజకవర్గం సమన్వయకర్త గొడ్డేటి మాధవి అన్నారు. మాట్లాడుతూ
రాష్ట్రవ్యాప్తంగా సిద్ధం పేరుతో నాలుగు భారీ క్యాడర్ సమావేశాలు నిర్వహించనున్నారు.ఈ నేపథ్యంలో శనివారం 27.న విశాఖపట్నం జిల్లా,భీమిలి నియోజకవర్గం,సంగివలస ఎఎన్ఐటి ఎస్ కాలేజ్ దగ్గర మధ్యాహ్నం 2:30 గంటలకు తొలి సమావేశం నిర్వహించనున్నామని ఈ కార్యక్రమంలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారన్నారు.రాష్ట్రంలో మళ్లీ జగనన్నే ముఖ్యమంత్రి గా చూడాలని సిద్ధమనే నినాదంతో ఉత్తరాంధ్ర వైఎస్సార్సీపీ శ్రేణులందర్ని 2024 ఎన్నికలకు సన్నద్ధం చేయనున్నట్లు పేర్కొన్నారు.జగనన్న పాలనలో అన్ని వర్గాల వారికి మేలు జరిగిందని,రాబోయే ఎన్నికల్లో ఆయన్ని గెలిపించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు.ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా,ఎన్ని ఆరోపణలు చేసిన రాబోయే ఎన్నికల్లో వైసిపి ప్రభుత్వం విజయాన్ని ఎవరు ఆపలేరని రాష్ట్రంలో మళ్లీ జగనన్న ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమన్నారు.ఈ సందర్భంగా అరకు పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన వైకాపా నాయకులు, పార్టీ శ్రేణులు , కార్యకర్తలు, అభిమానులు ప్రజలు భారీ సంఖ్యలో తరలి వచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు.రాబోయే ఎన్నికల కు ఈ సభ సమరశంఖం పూరించనున్నట్లు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *