సిరా న్యూస్,హైదరాబాద్;
ఎల్బీ నగర్ నియోజకవర్గం లో జీహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ మంగళవారం పర్యటించారు. వరద ముంపు ప్రాంతాల్లో సాగుతున్న నాలా పనులను పరిశీలించారు. సరూర్ నగర్ చెరువు ముంపు ప్రాంతాలైన తపోవన్ కాలనీ, గ్రీన్ పార్క్ కాలనీ వాసులతో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రాజశేఖర్ రెడ్డి, జోనల్ కమిషనర్ పంకజ, ఇంజనీరింగ్ అధికారులు పాల్గోన్నారు.