Girls Hostel: మామిడిగుడా హాస్టల్ లో వైద్యశిబిరం

సిరా న్యూస్,ఆదిలాబాద్‌
మామిడిగుడా హాస్టల్ లో వైద్యశిబిరం
ఆదిలాబాద్ మండ‌లంలోని అంకొలి ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలోని మామిడిగుడా బాలికల హాస్టల్ లో గురువారం వైద్య శిబిరం నిర్వ‌హించారు. ఈసంద‌ర్బంగా 43 మంది పిల్లలకు చిరు వ్యాధులకు మందు గోళీలు అంద‌జేశారు. ఒక్కరికి రక్త పరీక్షలు నిర్వ‌హించారు. కార్యక్రమంలో అంకొలి ఆరోగ్య ప‌ర్య‌వేక్షకులు బొమ్మెత సుభాష్, ఆరోగ్య సహయకులు పవర్ ప్రేమ్ సింగ్, ఇందు బాయి, ఆశ రుక్మిణి బాయి,ఇంచార్జి హెడ్ మాస్టర్ సుగుణ,హాస్టల్ ఏఎన్ఎం. కామేశ్వరి టీచర్లు ,విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *