సిరా న్యూస్,పిఠాపురం;
పిఠాపురం మండలం రాపర్తి గ్రామంలో గ్రామదేవతగా పూజలు అందుకుంటున్న శ్రీ గంగాలమ్మతల్లి జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి.ముందుగా గంగాలమ్మతల్లికి ప్రత్యేక పూజలను భక్తులు నిర్వహించారు.తప్పెటగుళ్ళు,కోలాటాలు,విచిత్ర వేషధారణలు తదితర కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఈ సందర్భంగా ముప్పిడి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.,గత 30 సంవత్సరాలుగా ఈ గంగాలమ్మతల్లి జాతర మహోత్సవాలు నిర్వహించడం జరుగుతోందని,జాతర మహోత్సవానికి సహకరించిన ప్రతీఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు..