మండలికి వెళ్లి… అసెంబ్లీకి డుమ్మాతో…

వైసీపీ సాధించేదేమిటీ
 సిరా న్యూస్,నెల్లూరు;
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎప్పుడూ రాంగ్ డెసిషన్ తీసుకుంటారు. సలహాదారులు ఎవ్వరో కానీ ఆయనకు పూర్తిగా రాజకీయం వంటబట్టలేదని అంటారు దగ్గర నుంచి చూసిన వాళ్లు. ఎందుకంటే కీలకమైన సమయంలో జగన్ పక్కకు తప్పుకోవడాన్ని అందరూ తప్పు పడుతున్నారు. ప్రధానమైన ప్రజలకు అవసరమైన బడ్జెట్ సమావేశాలను బహిష్కరించి జగన్ సాధించిందేమిటి? అన్న ప్రశ్నకు ఆయన వద్ద సమాధానం మాత్రం లేదు. తమకు మాట్లాడే అవకాశం ఎటూ ఇవ్వరు కాబట్టి ముందుగానే అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు ఆయన ప్రకటించి పెద్ద తప్పు చేశారని వైసీపీ నేతలే అభిప్రాయపడుతున్నారు. శాసనసభ బడ్జెట్ సమావేశాలకు వెళ్లి అక్కడ కేటాయింపులపై నిరసన తెలియజేసి బయటకు వచ్చినా సరిపోయేది కదా? అని కొందరు నేతలు ప్రశ్నిస్తున్నారు. వైసీపీకి వాకౌట్ అన్న ఒక ఆప్షన్ ఉందని జగన్ కు అసలు తెలుసా? అని ప్రశ్నిస్తున్నారు. తాను ముందుగానే ఊహించుకుని తనకు మాట్లాడే అవకాశం ఇవ్వరని తనకు తాను ముందుగా అంచనా వేసుకుని బహిష్కరిస్తానని ప్రకటించడం ఎంతవరకూ కరెక్ట్ అని వైసీపీ నేతలే ప్రశ్నిస్తున్నారు. మాట్లాడేందుకు సరైన అవకాశం ఇవ్వకపోతే అప్పుడే నిరసన తెలిపి అసెంబ్లీ నుంచి బయటకు వస్తే హుందాగా ఉండేదని, ముందుగానే సమావేశాలను బహిష్కరించడమేంటని కొందరు సోషల్ మీడియాలో జగన్ నిర్ణయాన్ని దుమ్మెుత్తిపోస్తున్నారు. ఒకవైపు శాసనమండలిలో జరిగే సమావేశాలకు హాజరవుతూ ఇటు అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండటం వైసీపీ ద్వంద వైఖరికి నిదర్శనమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. శాసనమండలిలో తమకు బలం ఉండటంతో సమావేశాలకు హాజరు కావడంతో పాటు బలం లేని చోటకు గైర్హాజరవ్వడం ఎందుకని? ఎక్కడైనా తమ వాయిస్ ను వినిపించేందుకు ప్రయత్నించాలని, ప్రజా సమస్యలపై గళమెత్తి చాటాలని, అప్పుడే ప్రజలు విశ్విసిస్తారని జగన్ కు హితవు చెబుతున్నారు. కేవలం పదకొండు మంది సభ్యులున్నంత మాత్రాన ప్రతిపక్షంగా శాసనసభ గుర్తించకపోయినా… హాజరయి తమ గళం వినిపించి ఉంటే ప్రజలు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చి ఉండేవారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. మొత్తం మీద జగన్ తీసుకున్న నిర్ణయం పార్టీలోనే వివాదానికి కారణమయిం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *