సిరా న్యూస్,గన్నవరం;
గన్నవరం మాజీ సర్పంచ్ గూడపాటి తులసిమోహన్ కుటుంబానికి చెందిన మామిడి తోటలో భారీగా గోవా మద్యం నిల్వ బయటపడింది. ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు గోవా నుండి దిగుమతి చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. మాజీ సర్పంచ్ తులసిమోహన్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ప్రధాన అనుచరుడుగా వ్యవహరిస్తున్నాడు. విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు మామిడి తోటవద్దకు చేరుకున్న చేరుకున్నారు.
ఎక్సైజ్ అధికారి ఆవులయ్య మాట్లాడుతూ గూడపాటి దుర్గాప్రసాద్ అనే వ్యక్తి మామిడి తోటలో భారీగా గోవా మద్యం నిల్వ ఉంచినట్లు సమాచారం. అందింది. స్థానిక పోలీసులతో కలిసి తనిఖీలు నిర్వహించాం. 58,080 క్వాటర్ బాటిళ్లు సీజ్ చేయడం జరిగిందని అన్నారు.
==================