సిరాన్యూస్,భీమదేవరపల్లి
ముగిసిన బీజేపీ నాయకులు గోదాల సంపత్ యాదవ్ అంత్యక్రియలు
* పాడే మోసి శ్రద్ధాంజలి ఘటించిన జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి
* పార్టీ జెండా కప్పి కన్నీటి వీడ్కోలు పలికిన బీజేపీ శ్రేణులు
భీమదేవరపల్లి మండల బీజేపీ పార్టీ ప్రధాన కార్యదర్శి గోదాల సంపత్ యాదవ్ అంతిమ యాత్ర శుక్రవారం సాయంత్రం ముగిసింది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జన్నపు రెడ్డి సురేందర్ రెడ్డి(కేఎస్ార్) పాల్గొని, పార్టీ శ్రేణులతో కలసి పార్థివ దేహం పై పార్టీ జెండా కప్పి కన్నీటి వీడ్కోలు పలికారు. అనంతరం వారి పాడే మోసి, పూల మాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. బీజేపీ పార్టీలో, వ్యక్తి గతంగా అప్తుడైన సంపత్ మరణం తీవ్రంగా కలచి వేసిందని, వారి మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. సంపత్ మృతి తీరని లోటని వారి ఆత్మ కి శాంతి చేకూరాలని, భగవంతుడు వారి కుటుంబానికి మనో ధైర్యాన్ని ప్రసాదించాలని అన్నారు. అంతిమ యాత్రలో బీజేపీ నాయకులు మాచర్ల కుమారస్వామి, పైడి పల్లి పృథ్వి రాజ్ గౌడ్, సదానందం, సమ్మయ్య, కిషన్, రాజు, సాయి, నవీన్, వికాస్, అభిమానులు, గ్రామస్తులు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.